మాస్క్ వేసుకోలేదని ప్రశ్నించిన పోలీసులపై దాడి

మాస్క్ వేసుకోలేదని ప్రశ్నించిన పోలీసులపై దాడి

ముంబై: మాస్కు ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించిన పోలీసులపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. సెంట్రల్ ముంబైలోని గరీబ్ నవాజ్ వద్ద గురువారం జరిగిన ఈ ఘటనలో పోలీసు సబ్ ఇనిస్పెక్టర్ తో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్ గాయపడ్డారు. ఫేస్ మాస్కులు వేసుకోకుండా వెళ్తున్న 15 మందిని పోలీసులు ప్రశ్నించగా.. వాగ్వాదానికి దిగారని, ఆపై దాడి చేశారని ఓ సీనియర్ అధికారి శుక్రవారం మీడియాకు తెలిపారు. కరోనావైరస్ నుండి రక్షణ కోసం ఫేస్ మాస్క్‌లు ఎందుకు ధరించలేదని పోలీసులు అడిగారు. దాదాపు 15 మంది పోలీసు బృందంతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్‌ఐతో సహా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి” అని ఆయన చెప్పారు. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, ఐపీసీ పలు సెక్షన్ల కింద దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.