
- 15 ఆటోలు, ఒక కారు కూడా..
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్పట్టణంలోని కేఆర్కే కాలనీలో ఆదివారం తెల్లవారుజామున 200ల మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 70 బైక్లు, 15 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ డాగ్ సహాయంతో 10 గ్రాముల ఎండు గంజాయిని, మూడు చిన్న గంజాయి మొక్కలను,20 మద్యం బాటిల్స్‌ను పట్టుకున్నట్లు తెలిపారు.
నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజల సంరక్షణ, భద్రత కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. మావల సీఐ కర్ర స్వామి, పట్టణ సీఐలు బి.సునీల్ కుమార్, నాగరాజు, ఫణిదర్, ప్రేమ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, ఎస్సైలు, ఏఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.