కరోనా అలర్ట్: ఒకేచోట 10 మంది కంటే ఎక్కువ ఉండొద్దు

కరోనా అలర్ట్: ఒకేచోట 10 మంది కంటే ఎక్కువ ఉండొద్దు

దేశంలో కరోనా కట్టడికి లాన్సెట్ ఇండియా సూచనలు చేసింది. కనీసం రెండు నెలల పాటు ఇండోర్ సమావేశాలను నిషేధించాలని తెలిపింది. రాజకీయ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కూడా కరోనా వ్యాపిస్తుందని సంస్థ తెలిపింది. పెళ్లిళ్లు, క్రీడలు కూడా వైరస్ స్ప్రెడ్‌కు కారణమవుతున్నాయని అభిప్రాయపడింది. సినిమా థియేటర్లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, స్టేడియాలను మూసివేయాలని చెప్పింది. కనీసం రెండు నెలలైనా ఈ నిబంధనలు పాటించాలని కోరింది. అంతేకాకుండా 10 మంది కంటే ఎక్కువమంది గుమ్మికూడకుండా చూడాలని తెలిపింది. ఏసీలు, పదిమంది కంటే ఎక్కువమంది ఒకేచోట ఉంటే కరోనా తొందరగా వ్యాప్తి చెందుతుందని జర్నల్ తెలిపింది. ఈ నిబంధనలు పాటిస్తే కరోనా వ్యాప్తిని అరికట్టొచ్చని కూడా తెలిపింది. 

ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు ప్రభుత్వాలు విలువ ఇవ్వాలని లాన్సెట్ కోరింది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా పెరుగుతున్న ఈ సమయంలో ఎలక్షన్ ర్యాలీలకు, పబ్లిక్ మీటింగ్‌లను ఎన్నికల సంఘం కంట్రోల్ చేయకపోవడాన్ని తప్పుబట్టింది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న కుంభమేళాను కూడా ప్రభుత్వం ఇంకా ఆపకపోవడంపై లాన్సెట్ విస్మయం వ్యక్తం చేసింది. దేశంలో కరోనా కేసులు ఫస్ట్ వేవ్ కన్నా ఎక్కువ రెట్లలో నమోదుకావడంతో జీనోమ్ సీక్వెన్స్ చేపట్టాలని సూచించింది.