భారత్ లో ఒకే రోజు 10 లక్షల టెస్టులు.. 30 లక్షలకు చేరువలో కేసులు

భారత్ లో ఒకే రోజు 10 లక్షల టెస్టులు.. 30 లక్షలకు చేరువలో కేసులు

భారత్ లో కరోనా పంజా విసురుతోంది. ప్రతి రోజు దాదాపు 65 వేలకు పైగా కేసులు నమోదవున్నాయి. నిన్న(ఆగస్టు 21న) 69,878 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 29,75,702 కు చేరింది. మరో 945 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 55,794 కు చేరింది. ఇక 22,22,578 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 6,97,330 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

భారత్ లో రోజు వారీ కరోనా టెస్టుల సంఖ్య 10 లక్షల మార్క్ కు చేరుకుంది. ఆగస్టు 21న 10,23,836 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో దేశంలో కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 3,44,91,073కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.