అమెరికాలో లెక్కలోకి రాని కరోనా మరణాలు చాలానే ఉన్నాయి

అమెరికాలో లెక్కలోకి రాని కరోనా మరణాలు చాలానే ఉన్నాయి
  • అంగీకరించిన టాస్క్ ఫోర్స్ మెంబర్ ఆంథోని ఫౌచీ

వాషింగ్టన్ : కరోనా తో అత్యంత ఎఫెక్ట్ అవుతోంది అమెరికానే. దీని బారిన పడి ఇప్పటికే దాదాపు 85 వేల మంది చనిపోయారు. ఐతే ఇంతకన్నా కూడా ఎక్కువ మంది కరోనాతో చనిపోయారంట. కానీ ఇవన్నీ లెక్కల్లోకి రాలేదంట. ఈ విషయాన్ని అమెరికాలోని కరోనా టాస్క్ ఫోర్స్ లోని కీలక మెంబర్ ఆంథోని పౌచీ తెలిపారు. కరోనాకు సంబంధించి చాలా మరణాలు లెక్కల్లోకి రావటం లేదన్నారు. ఐతే ఆ సంఖ్య ఎంత ఉంటుందో మాత్రం చెప్పలేనని అన్నారు. న్యూయార్క్ లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. పేషెంట్లకు సరిపడా హాస్పిటల్స్ లేకపోవటంతో చాలా మందికి ట్రీట్ మెంట్ అందటం లేదు. ఇలాంటి వారంతా ఇళ్లలోనే ఉండి కరోనా తీవ్రత ఎక్కువై చనిపోతున్నారు. కానీ వీరి డెత్స్ కరోనా మరణాలుగా పరిగణించటం లేదు. వీటిన్నంటికి కలుపుకుంటే అమెరికాలో కరోనా మరణాలు సంఖ్య లక్ష దాటేది. ఈ విషయాన్ని స్వయంగా కరోనా టాస్క్ ఫోర్స్ మెంబర్ ఆంథోని ఫోచీ అంగీకరించారంటే ఇక్కడ కరోనా ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐతే కొన్ని రోజులుగా మాత్రం కరోనా మరణాల సంఖ్య ఇక్కడ తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ ఆగస్టు నాటికి అమెరికాలో కనీసం లక్షా 50 వేల మంది కరోనా కారణంగా చనిపోతారని అంచనా వేస్తున్నారు.