నేటి నుంచి ఏపీ బార్డర్లు క్లోజ్

నేటి నుంచి ఏపీ బార్డర్లు క్లోజ్
  • 2 వారాలపాటు ఆంక్షలు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్​లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా బార్డర్లను కూడా మూసివేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. పబ్లిక్ వెహికల్స్ ను రాష్ట్రంలోకి అనుమతించబోమని తెలిపారు. అత్యవసర వాహనాలు, గూడ్స్, ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ కు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఇతర ఏ  వాహనాలకు పర్మిషన్ ఉండబోదని స్పష్టం చేశారు. 2 వారాల పాటు ఈ ఆంక్షలు ఉంటాయి.

కర్ఫ్యూ నిబంధనలు...

  • నేటి నుంచి ఈ నెల 18 వరకు కర్ప్యూ కొనసాగుతుందన్న ప్రభుత్వం
  • నేటి మధ్యాహ్నం 12 తర్వాత రాష్ట్ర సరిహద్దులు మూసివేత
  • కర్ఫ్యూ నుంచి పలు విభాగాలను మినహాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
  • కర్ఫ్యూ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు
  • కర్ఫ్యూ నుంచి టెలికామ్‌, ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలకు మినహాయింపు
  • కర్ఫ్యూ నుంచి బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ అవుట్‌లెట్లకు మినహాయింపు
  • కర్ఫ్యూ నుంచి విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలకు మినహాయింపు 
  • నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలకు మినహాయింపు
  • విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపించాలని ప్రభుత్వం ఆదేశం
  • కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు మినహాయింపు
  • ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి మినహాయింపు
  • రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశం
  • వివాహాలు, శుభకార్యాలు, వేడుకలపై కరోనా ఆంక్షలు
  • ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లు జరుపుకునేందుకు అనుమతి తప్పనిసరి
  • వివాహాలు, ఇతర శుభకార్యాలకు 20 మందికి మించవద్దని ఆంక్షలు
  • రోజంతా 144 సెక్షన్ అమలుచేయాలని ఆదేశాల్లో తెలిపిన ప్రభుత్వం

కరోనా ఆంక్షలు కఠినంగా అమలుచేయాలని జిల్లాల కలెక్టర్లు, ఆయా విభాగాల అధిపతులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు.