వజ్రాల ఎగుమతులకు కరోనా దెబ్బ

వజ్రాల ఎగుమతులకు కరోనా దెబ్బ

2008 కంటే దారుణమైన పరిస్థితులు

న్యూఢిల్లీ: ఇండియాలో వజ్రాల ఎగుమతులు భారీగా తగ్గనున్నాయి. కరోనా మహమ్మారితో డిమాండ్ తగ్గడంతో పాటు సప్లయి చెయిన్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో డైమండ్ఎక్స్‌‌పోర్ట్‌‌లు బాగా తగ్గనున్నట్టు జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్‌‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తెలిపింది. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా కట్, పాలీష్డ్  డైమండ్సేల్స్ గతేడాదితో పోలిస్తే20 శాతం నుంచి 25 శాతం తగ్గనున్నాయని కౌన్సిల్ ఛైర్మన్ కోలిన్ షా చెప్పారు. గతేడాది ఇవి 18.66 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.‘2008లో ఒక క్వార్టర్‌‌‌‌లో మాత్రమే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ తర్వాత ఇండస్ట్రీ రికవరీ అయింది. కానీ ఈసారి రెండు క్వార్టర్‌‌లు దెబ్బతిన్నాయి’ అని షా చెప్పారు. దివాళి, క్రిస్టమస్, వాలెంటైన్ డే వంటి ఫెస్టివల్స్ వచ్చే ఆరు నెలల్లో డిమాండ్ పెంచనున్నాయని భావిస్తున్నామని అన్నారు. కానీ ఫుల్ ఇయర్ ఎక్స్‌‌పోర్ట్‌‌లను మాత్రం ఇవి అందుకోలేవని చెప్పారు.  కరోనా వైరస్ అవుట్‌‌బ్రేక్‌‌తో దేశంలో మార్చి నుంచి కఠినతరమైన లాక్‌‌డౌన్ ఆంక్షలు విధించారు. బిజినెస్ యాక్టివిటీ దెబ్బతింది.