కరోనాతో మారిపోయిన అలవాట్లు 

V6 Velugu Posted on Apr 07, 2021

  • ఆహారం.. ఆరోగ్యంపైనే జనాల్లో ఆసక్తి
  • ఇమ్యూనిటి, హెల్దీపై పెరిగిన అవగాహన 
  • కూరలు, గింజలు, పండ్లతో  డైట్ ప్లాన్ 
  • మార్కెట్లోనూ ఎక్కువగా ఇవే ప్రొడక్ట్‌లు

హైదరాబాద్, వెలుగు : సిటీలో ఏ కిరాణా కొట్టుకెళ్లినా.. స్టోర్లో అడుగుపెట్టినా.. మెడికల్ షాప్ కు పోయినా ప్రస్తుతం మనకు కనిపించేవి హెల్దీ, ఇమ్యూనిటీ ప్రొడక్ట్లే !  జనం కూడా హెల్త్ ని ఇంప్రూవ్ చేసే ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ఏమొచ్చాయని ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ధర ఎక్కువైనా కొంటున్నారు. కరోనా వచ్చిన తర్వాత జనాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువైంది. మంచి ఆహారమే ఆరోగ్యానికి రక్ష అని ఎందరు చెప్పినా వినని జనం కరోనా దెబ్బతో ఒక్కసారి మారిపోయారు. మార్కెట్లో హెల్దీ ప్రొడక్ట్స్ని వెతికి మరీ కొంటున్నారు. బుధవారం ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా స్పెషల్ స్టోరీ.
కరోనా రాకతో పెరిగిన శ్రద్ధ 
కరోనా రావడంతో జనాల్లో టేస్ట్ కంటే హెల్త్పైనే ఇంపార్టెంట్ పెరిగింది.  ఒక్కసారిగా  ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. తినే ప్రతి ఐటమ్లోనూ ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుని తింటున్నారు. పిల్లలకు ఇచ్చే స్నాక్స్ నుంచి అన్నం వరకు అన్నింట్లో ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా చూసుకుంటున్నారు. కరోనా రాకుండా ఉండేందుకు బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోవాలని డాక్టర్స్ సూచిస్తూనే ఉన్నారు.  ముఖ్యంగా ఆకుకూరలు, విటమిన్ సి, డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు, మీట్ ఉండేలా చూసుకుంటున్నారు.  
బరువును తగ్గించుకునేందుకు..
లాక్ డౌన్లో పిల్లల్లో ఒబెసిటీ పెరగడంతో తగ్గించి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటెన్ చేసేలా డైట్ ని ప్లాన్ చేస్తున్నారు పేరెంట్స్.  న్యూట్రిషనిస్టులను కన్సల్ట్ అయి ఫ్యామిలీకి ఉపయోగపడేలా టిప్స్ తీసుకుంటున్నారు. పాలు, గుడ్డు, ఆకుకూరలు, ప్రొటిన్ ఫుడ్, మీట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 
యాప్స్‌లో డైట్ ప్లాన్ ఫాలో అవుతూ..
జనాలకు ఫుడ్పై కాన్షియస్ పెరిగిపోవడంతో అందుకు సంబంధించిన యాప్లను ఎక్కువగా వాడుతున్నారు. దీనికి సంబంధించి చాలామంది యాప్ డెవలపర్లు అన్ని రకాల డైట్ ప్లాన్లతో, డీటెయిల్ వివరాలతో అప్లికేషన్లను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం యాప్ స్టోర్ లో క్యాలరీ కౌంటర్- బెస్ట్ డైట్ ప్లాన్, డైటీషియన్స్ యాప్ ఎక్కువగా ఇన్ స్టాల్ అయ్యాయి. 

ఎక్కడ చూసినా హెల్దీ ప్రొడక్ట్‌లే..
 హెల్త్ అవేర్నెస్ కి అనుగుణంగా మార్కెట్లో హెల్దీ ప్రొడక్ట్స్ పెరిగిపోయాయి. సూపర్ మార్కెట్లు, జనరల్ స్టోర్లలో సగానికి పైగా ఇవే కనిపిస్తున్నాయి. కార్పొరేట్  హాస్పిటళ్లు కూడా తమ మెడికల్ కౌంటర్లలో ఇమ్యూనిటీ, ప్రొటీన్ ప్రొడక్ట్స్ ను ఉంచుతున్నాయి. ఆన్లైన్లోనూ వీటి అమ్మకాలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఒక్కో ప్రొడక్ట్ కి వందకు పైనే రేట్లున్నా ఖర్చు పెట్టేందుకు వెనకాడడం లేదు. 

హెల్త్ పైనే ఎక్కువగా దృష్టి 
కరోనాతో జనాల్లో హెల్త్ పై అవేర్నెస్ పెరిగిం ది.  ఏం తినాలి. ఏది తినకూ డదు.. వంటివాటిపై ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ఏ టైంకి తినాలి వంటివి ఫాలో అవుతున్నరు. హెల్త్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నరు. ఏ ఫుడ్ లో ఎలాంటి న్యూట్రిషన్స్ ఉంటాయని తెలుసుకుంటున్నరు. సోషల్ మీడియాలోనూ  ఫుడ్ టిప్స్ వీడియోలు చూస్తున్నరు. క్యాలరీలు కరిగిపోయేందుకు వాకింగ్ చేయడంతో పాటు ఈవినింగ్ స్నాక్స్ గా ఇమ్యూనిటీ పెంచే ఐటమ్స్ ని తీసుకుంటున్నరు. బాడీ మాస్ ఇండెక్స్ చేసి, పేషెంట్  మెజర్మెంట్చూసి డైట్ ప్లాన్ చెప్తున్నం. నెలలో 30 నుంచి 50మంది వరకు ఆన్లైన్లో సంప్రదిస్తున్నరు.  రెగ్యులర్ గానూ టచ్ లో ఉంటున్నరు. -డాక్టర్ నేహ,న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్స్

సేల్స్ పెరిగినయ్
 గతేడాది లాక్ డౌన్ టైం నుంచి ప్రతిరోజు వేలల్లో   ఆర్డర్స్ వస్తున్నాయి.  అయితే కరోనా కారణంగా చాలా మంది ఆన్లైన్లోనే ఆర్డర్లు చేస్తున్నరు. మటన్, చికెన్, సీ ఫుడ్ తో పాటు రెడీ టు కుక్ ప్యాక్ లు కూడా ఉంటాయి.  కొవిడ్ కంటే ముందు నుంచే జాగ్రత్తగా ఉంటున్నాం. స్టాఫ్ హెల్త్ ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నాం. -నిశాంత్ చంద్రన్, సీఈఓ, ఫౌండర్, టెండర్ కట్ ఆన్లైన్ మీట్ కంపెనీ
 

Tagged increase, corona effect, change, AWARENESS

More News