దేశ ఎగుమతులపై కరోనా పంజా

దేశ ఎగుమతులపై కరోనా పంజా
  • యూఎస్‌,యూరప్‌ బయ్యర్ల నుంచి పూర్తికాని పేమెంట్లు
  •  బెయిల్‌ ఔట్‌ప్యాకేజిని కోరుతున్న ఎక్స్ పోర్టర్లు

దేశ ఎగుమతులపై కరోనా ప్రభావం తీవ్రంగా కని పిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్లలో 15–20 శాతం క్యాన్సిల్‌‌ అయ్యాయని ఎక్స్‌‌పోర్టర్లు వాపోతున్నారు. ఎగుమతులపై రెస్ట్రిక్షన్స్ ‌ను వీలైనంత త్వరగా ఎత్తేయకపోతే 80 శాతం వరకు ఆర్డలు కోల్పోవలసి వస్తుందని, మన కస్టమర్లు చైనాకు వెళ్లిపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూఎస్‌, యూరప్‌, పశ్చి మాసియా బయ్యర్లు తమ పేమెంట్లను పూర్తి చేయలేదని, మేజర్‌‌‌‌ అమౌంట్‌‌ వీళ్లదగ్గ రే ఉండిపోయిందని ఎక్స్ ‌పోర్టర్లు చెప్పారు. ఎగుమతి దారులను రక్షించేందుకు ప్రభుత్వం బెయిల్‌‌ ఔట్‌‌ ప్యాకేజిని ప్రకటించాలని కోరుతున్నారు. దేశ ఎగు మతులపై కరోనా ప్రభావాన్ని అంచనా వేయాలని ప్రధాని నరేంద్రమోడీ మంత్రులను సోమవారం కోరారు. కొత్తసెక్టార్లు , మార్కెట్లును దృష్టిలో పెట్టుకొ ని ఎగుమతులకు బూస్ట్‌‌ ఇచ్చే ప్లాన్‌ ‌ను రెడీ చేయాలని మంత్రులకు సూచించారు . డిమాండ్‌‌ ఇప్పట్లో పుంజుకోదని ఎక్స్ ‌పోర్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. కోలుకున్నా మినిమ్‌ జూన్‌ చివరి వరకు టైమ్‌‌ పడుతుందన్నారు. కరోనాను కట్టడి చేసేంత వరకు వృద్ధిని ఆశించలేమని వాపోతున్నారు.

కేవలం ఆహారం, వ్యవసాయోత్పత్తులకే డిమాండ్‌‌ ..

ఆహారం, వ్యవసాయోత్పత్ తులకు మాత్రమే డిమాండ్‌‌ ఉందని ట్రేడ్‌‌ ప్రమోషన్‌ కౌన్ల్‌‌షి చైర్మన్‌ మోహిత్‌ సింగ్లా అన్నారు. ఎసెన్యషి ల్‌‌ ప్రొడక్ట్స్‌‌ కు డిమాండ్‌‌ అమాంతం పెరిగిందన్నారు. కానీ కంటై నర్లు దొరకడం, ప్యాకేజింగ్‌‌ మెటీరియల్స్‌‌, మెషినరీ వంటి విషయాలలో ఇబ్బందులున్నాయని చెప్పారు. స్పైసెస్‌ వంటి వాటిని యూరప్‌కు ఎగుమతి చేయడానికి సర్టిఫికేషన్‌ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కేవలం ఫుడ్‌‌ ఇండస్ట్రీ తప్పమిగిలిన అన్ని ఇండస్ట్రీలు కరోనా ప్రభావంతో నష్టపోతున్నాయని పేర్కొన్నా రు. ఆర్డర్లు క్యాన్సిల్‌‌ అవుతుండడమే ప్రస్తుతం ఎక్స్ పోర్టులను ఎక్కువగా కలవర పెడుతోందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్ పోర్టు ఆర్గనైజేషన్స్ ‌ సీఈఓ అజయ్‌ ‌సాహే అన్నా రు. కొన్ని సెక్టారలో ఈ క్యాన్షిలేషన్ 50 శాతం చేరుకుందని పేర్కొన్నా రు. హ్యాండిక్రాఫ్ట్స్‌‌ , కార్పెట్‌‌ , క్లాత్స్‌‌ వంటి సెక్టారలో ఈ ఈ క్యాన్షిలేషన్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయని అన్నా రు. కార్గో ఆపరేషన్స్‌‌ కంటే తక్కువ కెపాసిటీ లోడ్‌‌ అవుతుండడంతో కొన్ని సార్లు సరుకు పోర్ట్స్‌‌ దగ్గ ర కొచ్చినా ఎగుమతి కావడం లేదని ఫిక్కి తెలిపింది.

 మన కస్టమర్లు చైనాకు?

డెలివరీ చేయలేకపోవడంతో మార్చి ఆర్డర్లు కాన్సిల్‌ అయ్యాయని, ఏప్రిల్‌‌ ఆర్డర్లు ప్రస్తుతం హోల్డ్ ‌లో ఉన్నాయని ఇంజినీరింగ్‌‌ ఎక్స్ ‌పోర్ట్స్‌‌ ప్రమోషన్‌ కౌన్షిల్ ప్రెసిడెంట్‌‌ రవి షెగల్‌‌ అన్నారు. ఎగుమతులపై రెస్ట్రిక్షన్స్‌ ఇంకొంత కాలం కొనసాగితే దేశ ఎగుమతి దారులు తమ ఆరర్డ లో 80 శాతం నష్టపోవాల్సి ఉంటుందని చెప్పారు. మన కస్టమర్లు చైనాకు వెళ్లిపోతారని హెచ్చరించారు. మార్చినెలలో 12 శాతం వరకు షిప్‌‌మెంట్స్‌‌ పడిపోయాయని జెమ్స్‌‌, జ్యువలరీ ఎక్స్ పోర్ట్  ప్రమోషన్‌‌ కౌన్సిల్‌‌ తెలిపింది. దీంతో ఆర్థిక సంవత్సరం 2019–2020 లో అదనంగా 2.7 బిలియన్‌ డాలర్లు వరకు లాస్‌ ఉంటుందని అంచనావేసింది. మార్చి ముందు నెలల్లో ఈ షిప్‌‌మెంట్స్‌‌ సగటున 5.5 శాతం మాత్రమే తగ్గాయని గుర్తు చేసింది. సుమారు రూ. 15,000 కోట్లు విలువైన ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యాయని అపెరల్‌‌(క్లాత్స్‌) ఎక్స్ ‌పోర్ట్స్‌‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌‌ ప్రెసిడెంట్‌‌ శక్తివెల్‌‌ అన్నా రు. అంతేకా కుండా రూ. 10,000 కోట్లు విలువైన పేమెంట్లు నిలిచిపోయాయని పేర్కొన్నా రు. పూర్తిగా దివాలా తీశామని, రోజువారి ఖర్చులను కూడా చేయలేకపో తున్నామని చెప్పారు. ఇదేవిధంగా కార్పెట్‌‌ ఇండస్ట్రీ భారీగా నష్టపోతోంది.