19 లక్షలు దాటిన కరోనా కేసులు

19 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19 లక్షల,24 వేల 679కి చేరింది. మృతుల సంఖ్య 1,19,692 కు చేరింది. 4 లక్షల 45వేల 5 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా అమెరికాలో 5,86,941 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్పెయిన్ 1,70,099, ఇటలీ 1,59,516 , ఫ్రాన్స్ లో 1,36,779, జెర్మనీ 1,30,072 ,యూకే 88,621 ,చైనాలో 82,249 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇండియాలో నిన్న ఒక్కరోజే 12 వందలకు పైగా కేసులు నమోదవడంతో దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 10453 కు చేరింది. 358 మంది చనిపోయారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు  1,19,692 బలవ్వగా ఇందులో  ఒక్క అమెరికాలోనే 23,640 మంది చనిపోయారు. ఆ తర్వాత  ఇటలీలో 20,465, స్పెయిన్ 17,756, ఫ్రాన్స్ లో 14,967 యూకే లో 11,329, ఇరాన్ లో 4,585 మంది చనిపోయారు.