టాంజానియాలో వైరస్ టెస్ట్.. బొప్పాయి పండుకు కరోనా

టాంజానియాలో వైరస్ టెస్ట్.. బొప్పాయి పండుకు కరోనా

ఇప్పటివరకు పులులకు, పిల్లులకు కరోనా సోకిందని వార్తలు విన్నాం కానీ, ఇక్కడ పండుకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విచిత్ర ఘటన టాంజానియాలో జరిగింది. కరోనావైరస్ కిట్లను ఆ దేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. వాటి పనితనాన్ని పరీక్షించాలని బొప్పాయి పండు, మేక, గొర్రెలపై పరీక్ష చేశారు. ఆ ఫలితాల్లో బొప్పాయి పండుకు, మేకకు కరోనా సోకినట్లు ఫలితాలొచ్చాయి. దాంతో దిగుమతి చేసుకున్న కిట్లతో పరీక్షలు ఆపేయాలని టాంజానియా అధ్యక్షుడు జాన్ మాగుఫులి ఆదేశించారు. నాణ్యతలేని కిట్లను పంపిన దేశాలపై ఆయన మండిపడ్డారు. కిట్ల నాణ్యతపై పరీక్షలు జరపాలని టాంజానియా భద్రతా దళాలను ఆయన ఆదేశించారు.

మడగాస్కర్ ప్రభుత్వం కరోనాకు విరుగుడు కనిపెట్టిందని.. ఆ ఔషధాన్ని టాంజానియాకు కూడా తీసుకొస్తామని ప్రెసిడెంట్ మగుఫులీ అన్నారు. ‘నేను మడగాస్కర్‌తో కమ్యూనికేట్ చేస్తున్నాను. వారికి ఔషధం లభించింది. మేం కూడా ఆ ఔషధాన్ని టాంజానియాకు తీసుకొస్తాం’ అన్నారు.

కరోనావైరస్ వ్యాప్తి గురించి నిజాలు తెలియనివ్వడంలేదని టాంజానియా ప్రతిపక్షాలు మాగుఫులి ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. దానికి తోడు కిట్లలో నాణ్యత లోపించడంతో.. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి.

యునైటెడ్ స్టేట్స్, ఆసియా మరియు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలతో పోలిస్తే ఆఫ్రికాలో కోవిడ్ -19 పాజిటివ్ కేసులు మరియు మరణాలు చాలా తక్కువ. ఆఫ్రికాలో చాలా తక్కువ స్థాయిలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. అక్కడ పది లక్షల మందిలో కేవలం 500 మందికి మాత్రమే కరోనా టెస్ట్ చేస్తున్నారు.

టాంజానియాలో ప్రస్తుతానికి 480 కరోనా కేసులు నమోదుకాగా.. 17 మరణాలు నమోదయ్యాయి.

For More News..

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు

మద్యం ధరలు మరో 50 శాతం పెంచిన ఏపీ ప్రభుత్వం

మారటోరియం మరో మూడు నెలలు పెంపు!