
చైనాలో పుట్టి.. ప్రపంచ దేశాలకు వ్యాపిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ ముప్పు పక్కనే ఉన్న భారత్‌కు ఎక్కువగానే ఉంది. ఇంకా ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులోకి రాని ఈ కొత్త వైరస్‌ను భారత్‌లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది కేంద్రం. ఇప్పటికే చైనా నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ చేసిన తర్వాతే బయటకు పంపుతున్నారు. ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా అప్రమత్తమవుతున్నాయి అధికార వర్గాలు. ఇలా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జలుబు, దగ్గు ఉన్న ఇద్దరిని కరోనా బారినపడి ఉండొచ్చన్న అనుమానంతో స్పెషల్ మెడికల్ కేర్‌కు పంపారు. ఇప్పటికే ముంబైలోని చించ్‌పోకలి ఏరియాలోని కస్తూర్బా హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు.
అప్రమత్తమైన మహారాష్ట్ర సర్కార్
చైనా నుంచి వచ్చిన ఇద్దరికి శ్వాసలో సమస్యలు కనిపించడంతో ముందు జాగ్రత్తగా వారిని ఐసోలేటెడ్ వార్డులో ఉంచామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజా కేస్కర్ తెలిపారు. వారికి పూర్తి స్థాయిలో టెస్టులు చేసి కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణ అయితే డిస్‌చార్జ్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కరోనా వ్యాప్తి జరగకుండా చూస్తేందుకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. చైనా నుంచి వచ్చే వారిలో ఏమాత్రం తీవ్రమైన జలుబు, దగ్గు ఉన్నట్లు కనిపించినా అన్ని టెస్టులు చేయాలని నిర్ణయించామన్నారు.
కరోనా వైరస్ లక్షణాలు
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ బారినపడి ఇప్పటికే 25 మంది మరణించారు. ఆ దేశంలో దాదాపుగా 1000 మందికి ఈ కొత్త వైరస్ సోకింది. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని చైనా శాస్త్రవేత్తలు తేల్చారు. పాముల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకినట్లు గుర్తించారు. కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దాని సింప్టమ్స్‌కి మాత్రమే చికిత్స చేస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో జలుబు, దగ్గు, గొంతు గరగర, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే అప్రమత్తమై చికిత్స అందిస్తే ఓకే. కానీ ఆలస్యమైతే నాలుగు వారాలు దాటి బతకడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ అమెరికా, సౌదీ అరేబియా, థాయ్‌లాండ్, జపాన్ వంటి దేశాలకు వ్యాపించింది.