వారం రోజుల్లో 20ల‌క్ష‌ల మందికి సోకిన క‌రోనా

వారం రోజుల్లో 20ల‌క్ష‌ల మందికి సోకిన క‌రోనా

క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. వారం రోజుల వ్య‌వ‌ధిలో సుమారు 20ల‌క్ష‌ల మందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్ ఓ తెలిపింది.

ఈ సంద‌ర్భంగా డ‌బ్ల్యూహెచ్ ఓ డైర‌క్ట‌ర్ టెడ్రోస్‌ అధానోమ్ మాట్లాడుతూ వారం రోజుల్లోనే 20 లక్ష‌ల మందికి వైర‌స్ సోకిన‌ట్లు అంచ‌నా వేశారు. ఇందులో 7ల‌క్ష‌ల 50వేల‌మంది మ‌ర‌ణించార‌ని అన్నారు.

క‌రోనాపై టెడ్రోస్ మాట్లాడుతూ వైర‌స్ మ‌ర‌ణాల‌పై విచారం వ్య‌క్తం చేశారు. ప‌లు దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో రెడ్ జోన్లు కొన‌సాగుతున్న‌ట్లు చెప్పారు.వైర‌స్ ను ఎదుర్కొవడానికి నాయ‌కులు ముందుకు రావాల‌న్నారు. పౌరులు వైర‌స్ ను అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

క‌రోనా వైర‌స్ విష‌యంలో ప్ర‌పంచ దేశాలు న్యూజిల్యాండ్ ను ఆదర్శంగా తీసుకోవాల‌న్నారు. 100 రోజులవుతున్నా ఆ దేశంలో ఒక్క కేసు న‌మోదు కాలేదున్నారు.

లాక్ డౌన్ ఎత్తేసేందుకు వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు బ్రిట‌న్, ఫ్రాన్స్ తో పాటు ఇత‌ర దేశాలు అవ‌లంభిస్తున్న చ‌ర్య‌లు, కేసులు అరిట్టేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని డ‌బ్ల్యూహెచ్ ఓ డైర‌క్ట‌ర్ టెడ్రోస్‌ అధానోమ్ అన్నారు.