
ఇల్లందకుంట,వెలుగు: కరోనా వైరస్‌పై తప్పుడు సమాచారం ఇస్తూ టిక్‌టాక్ చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన కంచం అనిల్ టిక్‌టాక్‌లో కరోనా వైరస్‌పై తప్పుడు వాయిస్ ఇచ్చి వీడియో క్రియేట్ చేశాడు. అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రీతిసుధా తెలిపారు. ఇలాంటి తప్పుడు వీడియోల ద్వారా ప్రజలను భయాందోళనకు గురి చేయడం సరికాదని, తప్పుడు పోస్టింగ్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.