వారానికొకరు ఏసీబీకి చిక్కుతున్నరు

వారానికొకరు ఏసీబీకి చిక్కుతున్నరు
  • ఏసీబీకి పట్టుబడుతున్న అవినీతి ఆఫీసర్లు
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5నెలల్లోపు 15 మంది పట్టివేత
  • 10 కేసులు నమోదు.. అయినా మారని ఆఫీసర్ల తీరు

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సగటున వారానికో అవినీతి ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీబీకి చిక్కుతున్నారు. గడిచిన నాలుగు నెలల 10 రోజుల్లో లంచం తీసుకుంటూ 15 మంది అవినీతి అధికారులు చిక్కగా.. 10 కేసులు నమోదయ్యాయి. ఏసీబీ ఆఫీసర్లకు వరుసగా చిక్కుతున్నా ప్రభుత్వ శాఖల్లో ఆఫీసర్ల పద్ధతి మాత్రం మారడం లేదు. సర్వీసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే స్వార్థంతో పనులపై ఆఫీసులకు వచ్చే ప్రజలను పట్టి పీడిస్తున్నారు. డబ్బులు ఇస్తే పనులు చేయడం, లేదంటే కొర్రీలు పెట్టి ఫైల్స్‌‌‌‌‌ పెండింగ్ లో పెట్టడం పరిపాటిగా మారింది.

నాలుగు శాఖల్లోనే ఎక్కువ.. 

అత్యంత ఎక్కువగా అవినీతి జరిగే శాఖల్లో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ట్రాన్స్ పోర్ట్, పోలీస్, ట్రెజరీ శాఖలు ముందున్నాయి. వీటిలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్లలో అవినీతి తమ ఆఫీసు పరిసరాల్లోనే ఉండే అనధికార ఏజెంట్ల ద్వారా నడుస్తుంది. భూభారతి/మీసేవా ఆపరేటర్లు, డాక్యుమెంట్ రైటర్లు, ఆర్టీఏ ఏజెంట్లు మధ్యవర్తులుగా ఉంటూ ఆఫీసర్ల చేతికి మట్టి అంటకుండా వ్యవహారం చక్కబెడుతున్నారు. ఈ ఆఫీసుల్లో ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. 

ఎక్కడా డాక్యుమెంట్ రైటర్లు తాము తీసుకునే డబ్బులు సబ్ రిజిస్ట్రార్‌‌‌‌‌కో, తహసీల్దార్‌‌‌‌‌‌కి ఇవ్వడానికి అని చెప్పరు. డాక్యుమెంట్ ప్రిపరేషన్ చార్జీల పేరిట ఒక్కో ల్యాండ్ రిజిస్ట్రేషన్ లావాదేవీపై రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తారు. వారు తీసుకున్న డబ్బుల్లో సగానికిపైగా సాయంత్రానికి సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్లకే వాటాలుగా వెళ్తాయనేది జగమెరిగిన సత్యమే. ఇలా రోటీన్‌‌‌‌‌‌‌‌‌గా తీసుకునేవి కాకుండా ఏదైనా లిటిగేషన్ పేరిట ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినప్పుడు బాధితులు ఫిర్యాదు చేస్తే సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు ఏసీబీకి చిక్కుతున్నారు.

ఇటీవల జరిగిన ఘటనలు.. 

కరీంనగర్ ఫ్రూట్స్ దుకాణాల లైసెన్స్ రెన్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లంచం తీసుకున్న కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్ వన్ సెక్రటరీ పురుషోత్తం మార్చి 29న ఏసీబీ అధికారులకు చిక్కాడు. మార్కెట్ పరిధిలో 12 ఫ్రూట్స్ దుకాణాలు ఉండగా ఒక్కోషాపు నుంచి రూ.2 లక్షలు డిమాండ్ చేసి చివరికి రూ.60 వేల చొప్పున తీసుకునేందుకు అంగీకరించాడు. ఔట్ సోర్స్ సెక్యూరిటీ గార్డు శ్రీనివాస్ రెడ్డి మధ్యవర్తితో డబ్బులు తీసుకుంటూ దొరికిపోయాడు. 

జమ్మికుంట మండలం పెద్దంపల్లికి చెందిన వీఏవో స్వప్నకు రావాల్సిన గౌరవ వేతనం రూ.60 వేలు ఇచ్చేందుకు ఐకేపీ కోఆర్డినేటర్ పి. సురేశ్ రూ. 20 వేల లంచం డిమాండ్ చేశాడు. తొలి విడతగా బాధితురాలు రూ.4 వేలు ఇచ్చింది. ఏప్రిల్ 9న రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. 

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన కానిస్టేబుల్ సీపీఎస్ ఫండ్ నుంచి రూ. లక్ష లోన్ కోసం అప్లై చేసుకున్నారు. తన సీపీఎస్ అకౌంట్ నుంచి లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం కోసం ట్రెజరీ ఆఫీస్ లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ రఘు రూ.7 వేలు ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నాడు. లోన్ శాంక్షన్ కావడంతో ఒప్పందం ప్రకారం రూ. 7 వేలు ఇవ్వాలని వేధించడంతో బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ప్లాన్ ప్రకారం డబ్బు చెల్లిస్తుండగా రఘును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాలరీ బిల్లు చేసేందుకు ధర్మపురి మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కందుకూరి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 20 వేలు డిమాండ్ చేశారు. మార్చి 6న ఆ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాస్ ను పట్టుకున్నారు.

ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్టిగేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆసిఫోద్దిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవి, ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబార్డినేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవి కలిసి ఓ వ్యక్తి వద్ద రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా  జనవరి 15న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

తప్పు చేశామన్న భయం లేదు.. 

‘ఫొటోలో నోట్ల కట్టల ముందు చిరునవ్వు చిందిస్తూ కూర్చున్న ఈయన పేరు అర్రం రెడ్డి అమరేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఈయన తన పరిధిలోని వెంకటాపూర్ మండలం ఆవునూరు, అగ్రారాం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు సంంధించిన రూ.50 లక్షల బిల్లును కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శాంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి రూ.60 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే కరీంనగర్ లోని తన ఇంట్లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతడు తీసుకున్న డబ్బులు ముందుపెట్టి ఫొటో తీస్తుండగా.. ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఇలా నవ్వుతూ ఫోజు ఇచ్చాడు.’

మూడేళ్లలో నమోదైన కేసులు ఇలా..

సం                       కేసులు    పట్టుబడినవారు
2023                         8                 11  
2024                         11               17
2025(మే 9వరకు)    10               15