ఆసిఫాబాద్, వెలుగు : పత్తి చేనులో గంజాయి మొక్కులు సాగు చేయగా పోలీసులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం పరందోళి పంచాయతీ పరిధి కోటా గ్రామానికి చెందిన గైక్వాడ్ శివాజీ తన పత్తి చేనులో 28 గంజాయి మొక్కలను సాగు చేశాడు. వాటిపై సమాచారం అందడంతో ఎస్ఐ మధుకర్ సిబ్బందితో శుక్రవారం వెళ్లి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువు సుమారు రూ.2.80 లక్షలు ఉంటుంది. గంజాయి సాగు చేసినా, తాగినా నేరమని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
