100 మంది మైనర్లకు కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

100 మంది మైనర్లకు కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ లో బుధ, గురువారాల్లో నిర్వహించిన వెహికిల్ చెకింగ్ లో సుమారు 100 మంది మైనర్లు వాహనం నడుపుతూ చిక్కారని టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. పట్టుబడిన మైనర్ల నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుని, వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు చెప్పారు.  

మొదటి తప్పుగా ఫైన్ వేసి విడిచిపెడుతున్నామని, మరోసారి చిక్కితే మైనర్లకు వాహనాలిచ్చే యజమానులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.  కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరీముల్లా ఖాన్ , స్వామి, ఎస్సైలు ఇషాక్ , శనిగల శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.