
అమెరికా అధ్యక్ష ఎన్నికల జరిగాయి. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్ధి జో బైడెన్ గెలుపు ఖాయమని అందరు అనుకున్నారు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల నిర్వహణ సరిగ్గా జరగలేదంటూ అవాకులు చెవాకులు పేల్చారు. అంతే కాదు ఓట్ల లెక్కింపు ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ ఎన్నికలపై సుప్రీం కోర్ట్ కు వెళతానంటూ హెచ్చరికలు జారీ చేయడంతో అమెరికాలో ఎన్నికల తీరుపై ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. సాధారణంగా ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికా ఇతర దేశాల్లో ఎన్నికల్ని ఎలా నిర్వహించాలో సలహాలు, సూచనలిస్తుంటుంది. ఇప్పుడు అదే అమెరికా రాజకీయం కోసం పాకులాడుతుండడంపై నోరెళ్లబెడుతున్నాయి. మరికొన్నిదేశాలు ఇప్పుడు బనానా రిపబ్లిక్ అంటూ ఏకిపారేస్తున్నాయి. కాంబోడియాకు చెందిన సంస్థ పబ్లి మెట్రో అమెరికా తీరును తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు బనానా రిపబ్లిక్ ఎవరు అంటూ కామెంట్ చేసింది. ఆఫ్రికాలో కెన్యూ కార్టూనిస్ట్ ట్రంప్ తీరును తప్పుబడుతు కార్టున్ లు గీశారు. వైట్ హౌస్ రానని ట్రంప్ చెప్పడంపై కార్టూన్ల ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.