వేగం పుంజుకున్న రవాణా వ్యవస్థ

వేగం పుంజుకున్న రవాణా వ్యవస్థ

దేశంలో అపూర్వమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి వేదికను నిర్దేశిస్తుంది. భారతదేశం స్వర్ణ యుగం ఆశయ సాధనలో భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి విస్మయాన్ని నింపుతుంది. ఈరోజు బయట అడుగు పెడితే, పరిసరాల్లో గణనీయమైన మార్పును వెంటనే గ్రహించవచ్చు. బుల్‌‌‌‌డోజర్‌‌‌‌ల గర్జన, లోహపు గణగణ ధ్వనులు, జాక్‌‌‌‌హామర్‌‌‌‌ల శబ్దం చుట్టూ జరుగుతున్న నిర్మాణం పురోగతి సుమధుర సంగీతాన్ని ధ్వనిస్తుంది. ఇప్పుడు, భారతీయ ల్యాండ్‌‌‌‌స్కేప్ దిగంతం అత్యాధునిక హైవేలు, సొగసైన హై-స్పీడ్ రైళ్లు, అధునాతన ఆధునిక విమానాశ్రయాలతో నిండి ఉంది. ఇంత భారీ స్థాయిలో అంతే వేగంతో ఈ అపూర్వమైన మౌలిక సదుపాయాల వృద్ధి భారతదేశం స్వర్ణ యుగానికి పునాది వేస్తూ అద్భుతాన్ని నింపుతుంది. రైలు, రోడ్డు, వాయు మార్గాల ప్రయాణ సామర్థ్యంలో భారతదేశం పరివర్తనను చూస్తోంది. 

తద్వారా, వేగవంతమైన ఆర్థిక వృద్ధి మార్గంలో ఉన్న అతిపెద్ద అడ్డంకిని అధిగమించి, ఒకదానితో ఒకటి అనుసంధానంతో వ్యాపారం పెరుగుతోంది. ఈ రోజు 3.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశం 2025–-26 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే దాని ఆశయాన్ని నెరవేర్చడంలో కొత్త రోడ్లు, రైల్వేలు  సహాయపడతాయి. భారతదేశం ఈ ఏడాది తన జీడీపీలో 1.7%ని రవాణా అవస్థాపన కోసం ఖర్చు చేస్తుంది. ఇది అమెరికా, చాలా ఐరోపా దేశాలతో పోల్చితే రెండు రెట్ల కంటే ఎక్కువ. 2014-–15 లో కేంద్ర-ప్రభుత్వ రోడ్డు, రైలు రవాణా మూలధన వ్యయం  కేటాయింపు 2.75% నుంచి, ఇపుడు  ఏప్రిల్‌‌‌‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 11% వాటాకు పెరుగుతుంది. అటువంటి మౌలిక సదుపాయాలు కేంద్ర-ప్రభుత్వ శాఖ అయితే, ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖల తర్వాత  ఇది మూడవ అతిపెద్ద బడ్జెట్‌‌‌‌గా ఉంటుంది.

జాతీయ రహదారులు, విమానాశ్రయాలు

భారతదేశం ఏడాదికి10,000 కి.మీ జాతీయ రహదారి పొడవును అదనంగా కలుపుతోంది. 50,000 కి.మీ జాతీయ రహదారి భారతదేశం గత ఎనిమిది ఏండ్లలో జోడించబడింది. గ్రామీణ రహదారి నెట్‌‌‌‌వర్క్ పొడవు 2014లో 381,000కిమీ నుంచి 2023లో 729,000కిమీలకు పెరిగింది. ఇదే కాలంలో భారత విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. పౌర విమానాలు ఉన్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా, ఈ ఏడాది 148కి పెరిగింది. 2.26 లక్షల ఉడాన్ విమానాల్లో 1.13 కోట్ల మంది ప్రయాణికలు ప్రయాణించారు. ఉడాన్ పథకం కింద 73 కొత్త విమానాశ్రయాలు ప్రారంభం అయ్యాయి. కరోనా మహమ్మారి కు ముందు దేశీయ ప్రయాణీకుల సంఖ్య 2013లో 60 మిలియన్ నుండి 2019లో గరిష్టంగా 141మిలియన్ కి పెరిగింది.  మొత్తం ప్రయాణీకుల సంఖ్య త్వరలో  కరోనా మహమ్మారి  ముందు నాటి గరిష్టాలను రెట్టింపు చేయగలదని, రాబోయే పదేళ్లలో 400 మిలియన్​కు పెరుగుతుందని విమానయాన మంత్రి అంచనా వేస్తున్నారు.

మెరుగైన రవాణా నెట్​వర్క్​

2021లో, ప్రభుత్వం6 మంత్రిత్వ శాఖల్లో ప్రతిష్టాత్మకమైన డేటా-షేరింగ్ ప్లాన్‌‌‌‌ను ప్రవేశపెట్టింది. వృధాను తగ్గించడం మరియు డజన్ల కొద్దీ డేటా లేయర్‌‌‌‌లతో అధిక-నాణ్యతతో  డిజిటల్ మ్యాప్‌‌‌‌లను రుపొందించడం, అందించడం వంటి వనరులను ఉత్తమంగా ఉపయోగించడం దీని లక్ష్యం. పోర్ట్‌‌‌‌లు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వేలతో  పారిశ్రామిక వాడలను అనుసంధానించడం ద్వారా రవాణా నెట్‌‌‌‌వర్క్ యొక్క రూపకల్పన  భారతదేశం రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్న దేశ అవసరాలకు అనుగుణంగా వీలైనంత వృద్ధిచేసేలా ఇది సహాయపడుతుంది. భారతదేశాన్ని నాణ్యమైన, మెరుగైన రవాణా  నెట్‌‌‌‌వర్క్​తో అనుసంధానించడం ద్వారా దేశీయ మార్కెట్‌‌‌‌ను అభివృద్ధి చేయడం, బయటి ప్రపంచానికి కనెక్టివిటీని పెంచడం, వృద్ధిని వ్యాప్తి చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రవాణా, డిజిటల్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క పరివర్తన ప్రభావ శక్తిని బాగానే అంచనా వేయబడింది. భారతదేశం సాధించాలనుకుంటున్న అధిక వృద్ధికి ఇది ఒక ముందస్తు షరతు. ఇది భారతదేశంలోని అన్ని వర్గాలను ఉన్నతీకరించే ప్రగతిపధం.

- ప్రెస్​ ఇన్ఫర్మేషన్​ బ్యూరో (పీఐబీ)

వందే భారత్ రైళ్లు

160 కే ఎంపీహెచ్ మెరుపు వేగంతో పరుగెత్తే మొట్టమొదటి స్వదేశీ రూపకల్పన, నిర్మించిన వందే భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌కు2019లో ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత, నాలుగేళ్ళ కంటే తక్కువ వ్యవధిలో మరో ఎనిమిది వందే భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్ రైళ్లు ప్రారంభించబడ్డాయి. వేగవంతమైన కొత్త రైళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనే ఆశయంతో వచ్చే మూడేళ్లలో మరో 400 వందే భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తోంది. ఇదే కాలంలో అమెరికాకు చెందిన అసెలా సర్వీస్ కంటే అత్యధిక వేగంతో కూడిన నిజమైన హై-స్పీడ్ లైన్  జపనీస్ సహాయంతో పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్‌‌‌‌లోని ఆర్థిక రాజధాని ముంబై, అహ్మదాబాద్ మధ్య నిర్మించబడుతోంది. ఇది రెండు ఆర్థిక కేంద్రాల మధ్య ప్రయాణ సమయాన్ని ఆరు నుండి రెండు గంటలకు తగ్గిస్తుంది. ముంబై, ఢిల్లీ మధ్య, పంజాబ్, పశ్చిమ బెంగాల్ మధ్య రెండు కొత్త ‘సరుకు రవాణా కారిడార్లు’ సగం పూర్తి అయ్యాయి, వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడతాయి. 

మరో నాలుగు ప్రణాళికల్లో ఉన్నాయి. ఇప్పటికే ఉన్న లైన్లలో రద్దీని తగ్గించడం ద్వారా, కారిడార్లు ప్యాసింజర్ రైళ్లను వేగంగా నడపడానికి ఉపకరిస్తాయి. విద్యుద్దీకరించబడిన ట్రాక్‌‌‌‌లు1 కే ఎం- పొడవు ఉన్న రైళ్లలో ఈరోజు  25 కేపీహెచ్ వేగం నుంచి 70 కేపీహెచ్ వేగంతో వస్తువులను తరలించడానికి ఉపయోగ పడతాయి. కొత్త కారిడార్లు 2030 నాటికి రైల్వే సరుకు రవాణాను 27% నుంచి 45%కి పెంచుతాయి. మొత్తం సరుకు రవాణా పరిమాణంలో రైల్వేల వాటా బాగా పెరిగింది. పాలు, మాంసం, చేపలతో సహా పాడైపోయే పదార్థాల రవాణా కోసం2020 సంవత్సరంలో కొత్త ‘కిసాన్ రైలు’ ప్రారంభించబడింది. ఈ పరిణామాలన్నీ దేశం యొక్క గ్రీన్‌‌‌‌హౌస్ -వాయు ఉద్గారాలను అలాగే దిగుమతి చేసుకున్న ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.