
పెండ్లిండ్ల సీజన్ మొదలైంది. దానికి తగ్గట్టే సంబురాలు, సన్నాహాలు కూడా నడుస్తున్నాయి. తమ పెండ్లి వేడుక కనీవినీ ఎరుగని తీరుగా ఉండాలని అనుకుంటున్నారు ఈ జనరేషన్వాళ్లు. కరోనా భయం కూడా వీళ్లని కొత్తగా ఆలోచింపజేస్తోంది. ఆన్లైన్ పెండ్లిచూపులు, మెటావర్స్ రిసెప్షన్, జొమాటోలో గెస్ట్‌లకి డిన్నర్ ఆర్డర్ చేయడం ఈమధ్య పెండ్లి వేడుకల్లో వచ్చిన ట్రెండ్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో అచ్చం ఆధార్‌కార్డ్ టైప్‌లో ఉన్న వెడ్డింగ్ కార్డ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇంతకు ఈ పెండ్లి పత్రికను డిజైన్ చేయించింది ఎవరంటే... తన పెండ్లి పత్రిక వెరైటీగా ఉండాలను కున్నాడు ఛత్తీస్‌గఢ్‌లోని అంకిరా ఊరికి చెందిన లోహిత్ సింగ్. అచ్చం ఆధార్కార్డ్లా డిజైన్ చేయించాడు. ఆధార్ నంబర్ ప్లేస్‌లో పెండ్లి జరిగే తేదీ, అడ్రస్ ప్లేస్‌లో పెండ్లికి వచ్చే గెస్ట్‌లకు కోవిడ్ ఇన్‌స్ట్రక్షన్స్, క్యూఆర్ కోడ్ పెట్టించాడు. ఆ కార్డ్ చూసిన ప్రతి ఒక్కరు ‘ఇది ఆధార్‌కార్డా? వెడ్డింగ్ కార్డా?’ అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారట. ఈ నెల 9న అతని పెండ్లి జరిగింది.