పెళ్లై మూడు నెలలు…జంట అనుమానాస్పద మృతి

పెళ్లై మూడు నెలలు…జంట అనుమానాస్పద మృతి

హైద‌రాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో అనుమాస్పద స్థితిలో నవదంపతులు చనిపోయారు. వారికి మూడు నెళ్ల క్రితమే పెళ్లైనట్లు పోలీసులు గుర్తించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన అర్చన, సంతోష్  బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 శ్రీరాం నగర్ లో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం వారిద్దరూ ఒకే తాడుతో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఫ్యాన్ మీద నుంచి వేసిన ఒకే తాడుకు ఇద్దరూ వేలాడుతూ కన్పించారు. అయితే ఇద్దరు నేలకు ఆనుకుని ఉండటంతో వారి మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి…దర్యాప్తు చేపట్టారు పోలీసులు.