ఆదిలాబాద్ జిల్లాలో బస్సు ఢీకొని దంపతులు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో బస్సు ఢీకొని దంపతులు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. ఉట్నూర్ మండలం ఎంద గ్రామ ఎక్స్ రోడ్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. తోషం మండలం తోయగూడకు చెందిన పెందుర్ లక్ష్మణ్ (50), శేకు బాయి భార్యభర్తలు. మంగళవారం (మే 19) జైనూర్ మండలం పాట్నపూర్‎లో బంధువుల పెళ్లి ఉండటంతో దంపతులిద్దరూ బైక్‎పై వెళ్తున్నారు.

 ఈ క్రమంలో ఎంద గ్రామ ఎక్స్ రోడ్ సమీపంలో వీరు ప్రయాణిస్తోన్న బైక్‎ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య శేకు బాయి తీవ్రంగా గాయపడింది. అంబులెన్స్‎లో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు. 

►ALSO READ | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య