
లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రు కోర్టును ఆశ్రయించాడు. సోదాల్లో భాగంగా ఈడీ, సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న ఫైళ్ల, ఇతర వివరాలు బయటపెట్టొద్దని ఆదేశించాలంటూ రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఛార్జ్ షీటులోని సమాచారం బయటకు వెళ్తే తన వ్యాపారాలకు ప్రమాదమని, 1,97,000 మెయిల్స్ ను ప్రత్యర్థులు ఉపయోగించుకునే అవకాశముందని కోర్టు దృష్టికి తెచ్చారు. రహస్య ఒప్పందాలు లీకైతే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని సమీర్ మహేంద్రు తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకే కంపెనీల వ్యక్తిగత సమాచారం బయటపెట్టకుండా చూడాలని ఆదేశించాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయమూర్తి సమీర్ మహేంద్రు విజ్ఞప్తికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.