న్యూఢిల్లీ: కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ లను కలిపి తయారు చేసిన యాంటీబాడీ కాక్‌టెయిల్ ట్యాబ్లెట్లను.. రోష్ ఇండియా, సిప్లా సోమవారం ఇండియా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చాయి. తక్కువస్థాయి నుంచి ఒక మోస్తరు లక్షణాలు ఉన్న కరోనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపాయి. ప్రతి రోగి డోసు (1200 మిల్లీగ్రాములు.. 600 మి.గ్రా కాసిరివిమాబ్, 600 మి.గ్రా ఇమ్డెవిమాబ్) ధర రూ. 59,750 ఉంటుంది. మల్టీడోస్ ప్యాక్ ( ఇద్దరు రోగులకు ఉపయోగించవచ్చు) ధర రూ.1,19,500. ఈ ట్యాబ్లెట్లను ఆస్పత్రుల్లో, కొవిడ్ ట్రీట్‌మెంట్ సెంటర్లలో కొనుక్కోవచ్చని సిప్లా తెలిపింది.
