లాంగ్ కోవిడ్ లక్షణాలు మామూలుగా ఉండవ్

V6 Velugu Posted on May 04, 2021

కోవిడ్ వచ్చిన వాళ్లలో కొంత మంది హాస్పిటల్ కి పోతున్నారు. కొంత మంది ఇంట్లోనే ఐసొలేట్ అవుతున్నారు. రెండు వారాల్లో కోవిడ్ నెగటివ్ రిపోర్టు వస్తోంది. ఆ రెండు వారాలు జాగ్రత్తగా ఉంటే చాలని అందరూ అనుకుంటున్నారు. ఈ ధైర్యమే కరోనా నుంచి కాపాడుతుంది. అధైర్యపడకుండా అలాగే ఓ ఆరు నెలలపాటు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. నెగటివ్ వస్తే కోవిడ్ పూర్తిగా పోయినట్లు కాదు. దాని మూలంగా ఆగమైన అవయవాలు మళ్లీ ఒకప్పటిలా పనిచేయడానికి కొంతకాలం పడుతుందట. అప్పటిదాకా కొన్ని (చిన్న చిన్న) ఇబ్బందులు తప్పవంటున్నారు. ఆ ఇబ్బంది పేరే ‘‘లాంగ్ కోవిడ్’’ సిండ్రోమ్.

కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని కొన్ని దేశాల్లో కొవిడ్​ రోగులపై జరిగిన స్టడీస్​ చెబుతున్నాయి. కొవిడ్​ బారినపడిన వాళ్లు ఆ తర్వాత ‘లాంగ్​ కొవిడ్’ బారినపడే ప్రమాదం ఉందని అనేక దేశాల డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. లాంగ్​ కొవిడ్​ బాధితుల్లో కచ్చితంగా ఈ లక్షణాలు ఉంటాయని చెప్పలేం. దీనికి ఓ నిర్వచనం కూడా లేదు. ఆరు నెలలు, అంతకంటే ఎక్కువకాలం హెల్త్​ ప్రాబ్లమ్స్​తో కొంతమంది బాధపడుతున్నారు. ఆ సమస్యలనే ‘లాంగ్​ కొవిడ్​’ అంటున్నారు. లాంగ్​ కొవిడ్​ సమస్య ఇంటెన్సివ్​ కేర్​లో ఉండి కోలుకున్నవాళ్లకే కాదు తేలికపాటి లక్షణాలు ఉన్నవాళ్లలో కూడా ఉంది. బాడీలోకి కరోనా వైరస్‌ ఎంటరైన తర్వాత రెండు వారాల్లో వైరస్​ పోతుంది. కానీ, ఇన్ఫెక్షన్​, సైటోకైన్​ స్టార్మ్​ ప్రభావాల వల్ల దెబ్బతిన్న అవయవ వ్యవస్థలు పూర్తిగా బాగవ్వడానికి కొంతకాలం పడుతుంది. అందుకే లాంగ్​ కొవిడ్​ ఎఫెక్ట్​ కొందరిలో ఉంటుంది అంటున్నారు డాక్టర్లు. 
ఆరు నెలలు ఇబ్బందే 
లాంగ్​ కొవిడ్​ ఇన్నిరోజులు ఉంటుందని చెప్పలేం. కొందరిలో కొన్ని వారాలు ఉండొచ్చు. మరికొందరిలో నెలలపాటు ఉండొచ్చు. లాంగ్​ కొవిడ్​ లక్షణాలు పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరిలో ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. అమెరికాలో లాంగ్​ కొవిడ్​ గురించి జరిగిన స్టడీలో ‘నేచర్​’ జర్నల్​ ప్రచురించింది. 73,435 మంది కొవిడ్​ రోగుల హెల్త్‌ రికార్డులను ఎనలైజ్‌ చేసింది. లాంగ్​ కొవిడ్​ ఎఫెక్ట్​ ఆరు నెలల వరకు ఉంటుందని గుర్తించింది. దీనికి హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ అవసరం లేకున్నా డాక్టర్​ చెప్పినట్లుగా మందులు వాడుతూ ఉండాల్సి రావొచ్చనేది దాని సారాంశం. అలాగే లాంగ్‌ కొవిడ్‌ ఎఫెక్ట్‌  వల్ల మానసికంగా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు.   
కొవిడ్​ పేషెంట్స్​కి గైడ్​లైన్స్​ 
కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత కాలంలో ఉండే ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవడానికి, నేషనల్​ హెల్త్​ సర్వీస్​  కొన్ని గైడ్​లైన్స్​ని రూపొందించింది. కొవిడ్​ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ మూడు విషయాలపై శ్రద్ధ చూపాలని ఆ గైడ్​లైన్స్​లో సూచించారు.  
  కొవిడ్​ బారినపడి కోలుకున్న తర్వాత.. కొవిడ్​కు ముందు ఎలా ఉండేవాళ్లో అలా ఉండటానికి ప్రతిరోజూ కొంత టైం​ కేటాయించాలి. వెంటనే సాధారణ స్థితికి రావాలన్న ఆశతో శరీరంపై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. అలసిపోకుండా జాగ్రత్తపడాలి. ఒక పనికి, మరోపనికి మధ్య రెస్ట్​ తీసుకోవాలి. 
  చేసే పనుల్ని ఒకటీ, రెండు రోజుల్లో ఎక్కువ కష్టపడి ముగించడం కాకుండా, వారంలో అన్ని రోజులూ చేసేలా ప్లాన్​ చేయాలి. అప్పుడు శారీరక అలసట ఉండదు. మానసిక ఒత్తిడీ ఉండదు. ప్రశాంతంగా ఉంటారు. 
  చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. కానీ, అన్నింటినీ తలకెత్తుకుంటే చేసే ఓపిక లేకపోగా, ఉన్న ఆసక్తి కూడా పోతుంది. నిరాశలోకి పోకుండా ఉండాలంటే కచ్చితంగా చేయాల్సిన పనులు, ఇప్పుడు తప్ప తర్వాత చేయలేని పనులేవో గుర్తించాలి. తర్వాత కూడా పని పూర్తి చేస్తే నష్టం లేనివాటిని, కొంతకాలం తర్వాత చేసే అవకాశం ఉండే పనులేమిటో గుర్తించి వాటిని వాయిదా వేయాలి. ఇలా ప్రతి పనినీ అవసరమా? కాదా? అని ఆలోచించుకుంటూ చేయాలి. 
భరోసా ఉంది.. బాధ్యత మీదే
లాంగ్​ కొవిడ్​ ప్రాణాంతకమైన సమస్య కాదు. కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. జాగ్రత్తగా ఉంటే చాలు. హెల్త్​ ప్రాబ్లమ్స్​ ఎక్కువకాలం ఉండటం చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత కూడా డాక్టర్​ని కలవడం, ఆరోగ్యంపట్ల శ్రద్ధతో ఉండటం మరిచిపోవద్దు. పౌష్టికాలు ఉన్నవి తీసుకుంటూ, సాధారణ వ్యాయామాలు చేస్తూ ఉంటే లాంగ్​ కొవిడ్​ నుంచి త్వరగా కోలుకోవచ్చు. 
అలాగే సమస్యల తీవ్రత కూడా తగ్గుతుంది. కొవిడ్​ తగ్గిన తర్వాత ఆల్కహాల్, స్మోకింగ్​ అలవాట్లకు కొన్నాళ్లపాటు దూరంగా ఉండటం మంచిది. 

లాంగ్ కోవిడ్ లక్షణాలు

అలసట

కష్టంగా శ్వాస తీసుకోవడం

దగ్గు

కండరాలు, కీళ్ల నొప్పులు

వినికిడి లోపం

కంటిచూపు మసకబారడం

వాసన, రుచి పసిగట్టలేకపోవడం


 

Tagged Covid Treatment, covid effect, corona symptoms, , corona effect in body, long covid symptoms

Latest Videos

Subscribe Now

More News