మార్చి 16 నుంచి పిల్లలు, వృద్ధులకు వ్యాక్సిన్

మార్చి 16 నుంచి పిల్లలు, వృద్ధులకు వ్యాక్సిన్

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేసింది. మార్చి 16 నుంచి 12  నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో పాటు 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషనరీ డోసు పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్వీట్ చేశారు.

 


12 నుంచి 14 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీకి నేషనల్ టెక్నికల్ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు కేంద్రం బుధవారం నుంచి 12 నుంచి 14 ఏళ్ల వారికి టీకా ఇచ్చేందుకు సిద్ధమైంది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇవాన్ సంస్థ అభివృద్ధఇ చేసిన టీకాను పిల్లలను ఇవ్వనున్నారు. 

For more news

అరకు నుంచి అక్రమంగా గంజాయి

మోడీ మాస్కులకు ఫుల్ డిమాండ్