
ఇక నుంచి ఓపెన్ మార్కెట్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ లభించనుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను ప్రకటించింది సీరమ్ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క డోసు ధర రూ.400 గా ప్రైవేట్ కు రూ.600 గా నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి రూ. 250 కే ఇవ్వనుంది సీరమ్ సంస్థ. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అందించనుంది. ఇప్పటికే 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుంది ప్రభుత్వం.