విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచుతున్నాం : సీపీ గౌష్ ఆలం

విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచుతున్నాం :   సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ క్రైం, వెలుగు: విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని సీపీ  గౌష్ ఆలం అన్నారు. శుక్రవారం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో ‘సేఫ్ హాండ్స్ విత్ తెలంగాణ పోలీస్ -నారీశక్తి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ కేంద్రంగా మూడు రోజుల నారీ శక్తి కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. 

దానికి కొనసాగింపుగా వివిధ కమిషనరేట్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలీసు శాఖలో 33 శాతం ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. మహిళా పోలీసులను బీట్​పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌, డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ తనిఖీలు, ధర్నాలు, రాస్తారోకోలు, డయల్​100 విభాగాల్లోనూ భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు.

 మహిళా పోలీసులకు వారి విధుల్లో ఎదురయ్యే సమస్యలు, సందేహాలను నివృత్తి చేసి, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. డాక్టర్ నరేశ్‌‌‌‌‌‌‌‌  సీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన కల్పించారు. 

అంతకుముందు విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మహిళా బ్లూకోల్ట్స్‌‌‌‌‌‌‌‌ సేవలను ప్రారంభించారు. సమావేశంల ఁఅడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు మాధవి, యాదగిరిస్వామి, శ్రీనివాస్ జి, వెంకటస్వామి, ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు శ్రీలత, ఫింగర్ ప్రింట్స్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వర్ణ జ్యోతి, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐలు రజినీకాంత్ , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.