హైదరాబాద్- అంతర్‌రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు అరెస్టు చేశారన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. నైజీరియన్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రాకెట్ నడిపిస్తున్న వ్యక్తి నైజీరియన్ మార్క్ ఓలాబీ అని, 2012లో బిజినెస్ వీసాపై ముంబై వచ్చాడన్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నట్టు గుర్తించామన్నారు. నైజీరియన్ మార్క్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు తోట హర్ష వర్ధన్, దుద్దు పవన్ కుమార్, స్వామి ప్రసాద్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 38 గ్రాముల కాంట్రాబ్యాండ్ నార్కోటిక్ డ్రగ్(కొకైన్), మూడు ద్విచక్రవాహనాలతో పాటు రూ. 22 వేల నగదు, డిజిటల్ వేయింగ్ మిషన్, ఓ మొబైల్ పోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు సీపీ మహేష్ భగవత్.
