
కరీంనగర్ సిటీ, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధమవ్వాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షణీయమని, ఎస్సీ, ఎస్టీలకు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు.
20 నెలలుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన వేల కోట్ల నిధులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి తదితరులున్నారు.