యాదాద్రి, వెలుగు : బునాదిగాని కాల్వ నిర్మాణం పూర్తి చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వ హించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏండ్ల తరబడి బునాదిగాని కాల్వ అసంపూర్తిగా ఉందన్నారు.
బీబీనగర్ మండలం మక్తానంతారం నుంచి అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు 98 కిలోమీటర్ల కాలువ నిర్మాణం సాగాల్సి ఉందన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు రూ.34 కోట్లు ఖర్చు చేసి కేవలం 34 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారని తెలిపారు.
కాల్వ నిర్మాణం పూర్తి చేయడానికి రూ. 269 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపినా ఫండ్స్ రిలీజ్ కావడం లేదన్నారు. ఇప్పటికైనా ఈ కాల్వ నిర్మాణం పూర్తి చేసి పంట పొలాలకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కే గంగాధర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, కొండమడుగు నరసింహ
పాల్గొన్నారు.