
- సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: అనాజ్ పూర్ రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. భూపోరాటం చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నర్సింహతోపాటు పలువురు రైతులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పహడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. అరెస్టైన వారినితక్షణమే విడుదల చేసి బాధిత రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేసింది.