సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గం : జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు

సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గం : జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు

మోపాల్, వెలుగు : జీపీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు డిమాండ్​ చేశారు. గురువారం మోపాల్ లోని ఎంపీడీవో ఆఫీస్​వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. అనంతరం కార్మికులు ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్​ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రమేశ్​బాబు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, లీడర్లు ధర్మానంద్, ప్రదీప్, శ్రీనివాస్​పాల్గొన్నారు.

భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని18 పంచాయతీల్లో పనిచేస్తున్న జీపీ కార్మికులు, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక దీక్ష 8వ రోజుకు చేరింది. గురువారం జీపీ కార్మికులు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. కారోబార్ల సంఘం స్టేట్​ కోశాధికారి పిల్లి యాదగిరి మాట్లాడుతూ.. ప్రభుత్వం జీపీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కారోబార్లను వెంటనే పర్మినెంట్​ చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేశారు.

నవీపేట్ : జీపీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి డిమాండ్ ​చేశారు. గురువారం నవీపేటలో జీపీ కార్మికుల సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం కార్మికులకు భోజన ఏర్పాట్లు చేశారు. ఎంపీటీసీ రాధ, సొసైటీ డైరెక్టర్ బాల గంగాధర్ పాల్గొన్నారు. నవీపేటలో ప్రైవేట్​కూలీలతో పారిశుద్ధ్య పనులు చేయిస్తుండగా సీఐటీయూ నాయకులు అడ్డుకున్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, ఇతర కూలీలతో పనులు చేయించడం సరికాదన్నారు.