సీట్లు తగ్గుతాయని.. బీజేపీ భయపడ్తున్నది : బీవీ రాఘవులు

సీట్లు తగ్గుతాయని.. బీజేపీ భయపడ్తున్నది : బీవీ రాఘవులు

హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో లోక్​సభ సీట్లు తగ్గుతాయనే భయం బీజేపీని పట్టుకున్నదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. ఆదివారం ఎంబీ భవన్​లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువల పునాదులను ధ్వంసం చేస్తున్నది. 

దేశ భవిష్యత్తు అంధకారంలోకి నెడ్తున్నది. దేశాన్ని రక్షించుకోవడం కోసమే ప్రతిపక్షాలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి. ప్రజలను మభ్యపెట్టేందుకే బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నరు. ఓడిపోతామనే భయంతోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్​ను మోదీ అరెస్ట్ చేయించారు. ఈడీ, సీబీఐతో ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’’అని విమర్శించారు.