ఉద్యోగాల కోసం… బెంగాల్‌లో సీపీఎం యూత్ వింగ్ నిరసన

ఉద్యోగాల కోసం… బెంగాల్‌లో సీపీఎం యూత్ వింగ్ నిరసన

పెరిగిపోయిన నిరుద్యోగంపై వెస్ట్ బెంగాల్ లో సీపీఎం ఆధ్వర్యంలో యువత నిరసన తెలుపుతోంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం హౌరాలో ఇవాళ సీపీఎం యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో యువత రోడ్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించారు. నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆందోళనకారులను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. యువత, పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణ .. రాళ్లదాడి వరకు వెళ్లింది. దీంతో.. పోలీసులు నిరసనకారులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితిని పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.