
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
యాదాద్రి, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధత కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా వలిగొండలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లను కల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపిన ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీసీ బిల్లుకు బీజేపీ ఎంపీలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు.
బిహార్‌లో అసలైన ఓటర్లను తొలగించి నకిలీ ఓటర్లను చేర్చడం ద్వారా గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. మీటింగ్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ.జహంగీర్, మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, తప్పట్ల స్కైలాబ్‌బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ పాల్గొన్నారు.