
హైదరాబాద్ , వెలుగు : సీఎం రేవంత్ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా (సీపీఆర్వో ) నియమితులైన బి. అయోధ్య రెడ్డి బుధవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. బొకే ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సీఎం ఆఫీసులో సీపీఆర్వోగా నియమించినందుకు అయోధ్య రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.