క్రాకర్ షాప్ ఎన్ వోసీకి రూ.3 వేలు లంచం

క్రాకర్ షాప్ ఎన్ వోసీకి రూ.3 వేలు లంచం

మహేశ్వరానికి చెందిన ఫైర్ మెన్ ని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు 

మహేశ్వరం, వెలుగు: క్రాకర్స్ షాప్ ఏర్పాటుకి ఎన్ వోసీ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసి లంచం తీసుకున్న ఫైర్ మెన్ ను ఏసీబీ అధికారులు
అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..మహేశ్వరంలోని కందుకూరు, కడ్తాల్ మండలాల్లో క్రాకర్స్ షాప్ ఏర్పాటుకు మహేశ్వరంలోని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ అనుమతులు తీసుకోవాలి. ఈ 3 మండలాల పరిధిలో మొత్తం 43 షాప్ ల ఏర్పాటుకు వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో క్రాకర్స్ షాప్ అనుమతికి ఎన్ వోసీ ఇవ్వడం కోసం లీడింగ్ ఫైర్ మెన్ గురవయ్య రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు వ్యాపారుల నుంచి డిమాండ్ చేశాడు.

ఈ క్రమంలో క్రాకర్ షాప్ ఎన్ వోసీకి రూ.2,500 ఇవ్వాలని తుమ్మలూరుకి చెందిన దుర్గాప్రసాద్ ని గురవయ్య డిమాండ్ చేసి రూ.1,500కి ఒప్పందం కుదర్చు కున్నాడు. దుర్గాప్రసాద్ ఈ నెల 23న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు శనివారం మహేశ్వరం ఫైర్ స్టేషన్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు. మొత్తం 43 క్రాకర్స్ షాప్ ల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చినట్టు గుర్తించారు. ఒక్కో షాప్ ఓనర్ దగ్గరి నుంచి రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు ఫైర్ మెన్ గురవయ్య డిమాం డ్ చేశాడని నిర్ధారించుకున్నాడు. లంచం అడిగిన ఫైర్ మెన్ గురువయ్యను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురవయ్యను ఏసీపీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు.