గోద్రెజ్ నుంచి మై ఫార్మ్‌‌‌‌‌‌‌‌ పాలు

 గోద్రెజ్ నుంచి మై ఫార్మ్‌‌‌‌‌‌‌‌ పాలు

హైదరాబాద్, వెలుగు:  గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ  క్రీమ్‌‌‌‌‌‌‌‌లైన్  డెయిరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మై ఫార్మ్ మిల్క్ పేరుతో సొంత పాల బ్రాండ్​ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మహారాష్ట్రంలోని తమ సొంత ఫామ్​లోని ఆవుల నుంచి తీసిన పాలను నేరుగా కస్టమర్లకు అమ్ముతుంది. పూర్తిగా యంత్రాలతో  పిసికిన పాలను కస్టమర్​కు అందజేస్తామని తెలిపింది. వీటిలో ఎటువంటి రసాయనాలు గానీ, కాలుష్యం గానీ ఉండబోదని హామీ ఇచ్చింది. 

పాశ్చరైజ్ చేశాక అత్యాధునికంగా టెక్నాలజీతోప్యాక్ చేసి పంపిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఈ పాలు హైదరాబాద్​మార్కెట్​కు సరఫరా చేస్తున్నామని, అరలీటరు ధర రూ.50 అని గోద్రెజ్ జెర్సీ సీఈఓ భూపేంద్ర సూరి ప్రకటించారు. తమ సంస్థకు దేశవ్యాప్తంగా పది ప్లాంట్లు ఉన్నాయని, హైదరాబాద్​కు 86 లక్షల లీటర్లు పంపిస్తామని చెప్పారు.