ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ

ఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై ఆందోళనలు జరుగుతున్నాయి. అమరావతి సహా విశాఖపట్నం, కర్నూలును కూడా రాజధానులుగా YCP ప్రభుత్వం ప్రకటించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ రాజధాని అంశంపై మొదటి సారిగా స్పందించింది.TDP ఎంపీ గల్లా జయదేవ్  ఇవాళ లోక్ సభలో రాజధాని గురించి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పష్టత ఇచ్చారు. రాజధానిపై రాష్ట్రాలదే తుది నిర్ణయమని.. ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉందని లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. ఇందులో కేంద్రం కలగజేసుకోదన్నారు.

2015 ఏప్రిల్ 4నలో ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని.. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వచ్చాయని తెలిపారు. కానీ ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా రిపోర్టుల్లో చూశామని తెలిపారు. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని నిత్యానంద రాయ్ తెలిపారు.