
న్యూఢిల్లీ: ఆసియా కప్ విషయంలో పాక్ ప్రతిపాదిత ‘హైబ్రిడ్ మోడల్’కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇండియా ఆడే మ్యాచ్‌లను శ్రీలంకలో, మిగతా మ్యాచ్‌లను పాక్‌లో ఆడేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఏసీసీ హెడ్ జై షా మంగళవారం దీనికి అధికారికంగా ఆమోదముద్ర వేయనున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఆసియా కప్‌కు లైన్ క్లియర్ కావడంతో అక్టోబర్–నవంబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ విషయంపై కూడా సందిగ్ధత తొలగిపోయింది. పాక్ ప్రతిపాదిత హైబ్రిడ్ మోడల్‌కు తొలుత ఇండియాతో పాటు చాలా దేశాలు అంగీకరించలేదు. దీంతో సమస్యను పరిష్కరించాలని ఒమన్ క్రికెట్ బోర్డు చీఫ్ పంకజ్ ఖిమ్జి చేతుల్లో పెట్టారు. మిగతా దేశాలతో మాట్లాడిన ఖిమ్జి.. నాన్ ఇండియా మ్యాచ్‌లను పాక్‌లో ఆడేందుకు ఒప్పించాడు.