మూడు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మూడు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..  ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆక్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వరుసగా మూడో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించిన ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 3–0తో క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆదివారం వర్షం అంతరాయం కలిగించిన చివరి పోరులో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 27 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో (డక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచింది.  తొలుత కంగారూ టీమ్ 10.4 ఓవర్లలో 118/4తో నిలిచిన దశలో వర్షంతో ఆట ఆగింది. ట్రావిస్ హెడ్ (33), మాథ్యూ షార్ట్ (27), గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్ (20) రాణించారు. 

ఆసీస్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అక్కడితోనే ముగించి అంపైర్లు కివీస్ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 10 ఓవర్లలో 126 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లెక్కగట్టారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన న్యూజిలాండ్ 10 ఓవర్లలో 98/3 స్కోరు మాత్రమే చేసి ఓడింది. గ్లెన్ ఫిలిప్స్ (40 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. మాథ్యూ షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డులు దక్కాయి.