భార్యను నరికి.. కొడుకును నీళ్లల్లో వేసి..

భార్యను నరికి.. కొడుకును నీళ్లల్లో వేసి..


హైదరాబాద్ సిటీ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో ఘోరం జరిగింది. ధనరాజ్‌ అనే వ్యక్తి భార్య లావణ్యను గొడ్డలితో నరికి చంపాడు.. చిన్నారి కొడుకు ఏడుస్తున్నాడని.. నీటి సంపులో వేసి చంపాడు.. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు ఆ భర్త. ఇంత కంటే దారుణం ఏమైనా ఉంటుందా.. నాలుగేళ్ల క్రితం వీరి పెళ్లయిందని.. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 

అత్యంత కిరాతకంగా భార్యను చంపటమే కాకుండా.. పసి పిల్లోడిని కూడా నీటి సంపులో వేసి చంపటాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. భార్యాభర్తల మధ్య గొడవలో మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని చెబుతున్నారు పోలీసులు. చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారని.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామంటున్నారు పోలీసులు.