కొడుకును చంపి.. తలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన తండ్రి

కొడుకును చంపి.. తలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన తండ్రి

పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి డబ్బులు అడుగుతున్నాడని కన్న కొడుకును ఓ తండ్రి హత్య చేశాడు. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బత్తుల కిషోర్ ను తండ్రి వీరయ్య చంపిన విషయం విధితమే. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కొడుతుండటంతో విసుగు చెందిన తండ్రి కొడుకును నరికి చంపినట్లు తెలుస్తోంది.

ఇక కిషోర్ కు పెళ్లి కాగా.. భర్తతో గొడవలు కారణంగా భార్య పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో వీరయ్య, కిషోర్ ఉండగా గొడవ చెలరేగి హత్యకు దారి తీసింది. ప్రస్తుతం ఇంట్లో వీరయ్య, కిషోర్ ఉంటున్నారు. కిషోర్ తాగొచ్చి తండ్రితో గొడవ పెట్టుకొని హింసించే వాడు. రోజులాగే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో విసుగు చెందిన వీరయ్య కొడుకు తల నరికి హత్య చేశారు. కొడుకు తను ఒక బస్తాలో పట్టుకొని పోలీసులకు లోంగిపోయాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.