ఖమ్మం నగరంలో రోడ్ల మీద టిఆర్ఎస్ బోర్డులు , ఫ్లెక్సీలపై అపోజిషన్ పార్టీలు ఫైరవుతున్నాయి. రోడ్ల విస్తరణ పేరుతో పార్టీలతో సంబంధం లేకుండా అన్ని దిమ్మెలను కూల్చిన అధికార పార్టీ... ఇప్పుడు తమ ప్రచారం మాత్రం కొనసాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్లెక్సీ బోర్డుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నా.. ఖమ్మం టిఆర్ఎస్ నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కమీషనర్ వీటిపై యాక్షన్ తీసుకోవాలంటూ స్థానిక సీపీఎం నేతలు కంప్లయింట్ చేశారు
