
తిరువనంతపురంలోని అనంతపద్మనాభుడ్నిట్రావెన్ కోర్ రాజులు వంశపారంపర్యంగా కొలుస్తూ వస్తున్నా రు. కానీ, కాసర్ గోడ్ లోని అనంత సరోవర మందిరంలో కొలువైన అనంతపద్మనాభుడికి ఒక మొసలి కాపలాగా ఉంటోంది. దాని పేరు బాబియా. ఇది పూర్తి గా శాకాహారి. బియ్యం తో స్వామివారికి చేసే ప్రసాదాన్ని భక్తులు దీనికి పెడ్తా రు. కొలనులోని చేపల జోలికి అస్సలుపోదు. ఈ మొసలి వందల ఏళ్లుగా ఇక్కడ ఉంటోందట. స్వాతంత్య్రానికి పూర్వం ఒక బ్రిటీష్ దొర ఈ మొసలిని కాల్చి చంపాడని, ఆ పాపం చుట్టుముట్టి పాము కాటుకి అతను చనిపోయాడని స్థానికులు చెప్తుంటారు. అయితే కొన్నా ళ్లకు ఆ మొసలిమళ్లీ ఆ గుడి కొలనులోనే ప్రత్యక్షమైందట. ఎన్నో ఏళ్లుగా కొలనులో ఉంటున్న ఆ మొసలిని దైవస్వరూపంగా అక్కడి ప్రజలు కొలుస్తున్నారు. అయితే హేతువాదులు మాత్రం 2006లో జింబాబ్వేలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తున్నా రు. మాం సం కొరత కారణంగా కరిబా సరస్సులోని లక్షకు పైగా మొసళ్లకు కూరగాయల్ని అలవాటు చేశారు అక్కడి నిర్వాహకులు. బహుశా బాబియా కూడా అదే రీతిలో శాకాహారిగా మారి ఉంటుం దని హేతువాదులు అభిప్రాయపడుతున్నారు.
పురాణ ప్రశస్తి…
ఒకప్పుడు బిల్వమంగళం అనే భక్తుడు విష్ణువు కోసం భీకర తపస్సు చేశాడు. అతని నిష్ఠకు మెచ్చి శ్రీకృష్ణుడు బాలుడి రూపంలో దర్శనమిచ్చాడు. అయితే ఆ పసివాడిపై బిల్వమంగళం ప్రేమను పెం చుకున్నాడే తప్ప.. మారురూపంలో ఉన్న భగవంతుడ్ని గుర్తించలేకపోయాడు. ఒకరోజు బాగా అల్లరి చేసిన ఆ పిల్లాడిపై బిల్వమంగళం కోప్పడ్డాడు. దాంతో అలిగిన శ్రీకృష్ణ భగవానుడు దగ్గర్లోని ఒక గుహలోకి వెళ్లాడు. అప్పుడు అతను దేవుడని గ్రహిం చిన బిల్వ మంగళం గుహలో వెతికాడు. అలా వెతుక్కుంటూ బయటకు వచ్చేసరికి మహాపద్మనాభ స్వామి విగ్రహం కనిపించింది. అప్పటి నుంచి గుహకు రెండు వైపులా ఉన్న ప్రాంతాలకు అనంతపురం(ఒకవైపు తిరువనంతపురం,మరోవైపు అనంతపురం) అనే పేరు వచ్చింది.