బీమా ఇవ్వాల్సిందే.. పంటలూ కొనాల్సిందే

బీమా ఇవ్వాల్సిందే.. పంటలూ కొనాల్సిందే

వ్యవసాయ  బిల్లులు రద్దు చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తాం –పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: రైతులకు పంటల బీమా ఇవ్వాల్సిందే.. దీనితోపాటు పంటలను కొనాల్సిందే.. మోడీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ  బిల్లులు రద్దు చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో సీఎల్పీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దీక్ష నిర్వహించింది. ఈ దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీ.హెచ్,  కోదండరెడ్డి, సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు యూత్ కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా తరలివచ్చారు. దారిపొడవునా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 3 రైతు చట్టాలను తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలన్నారు. 44 రోజులుగా రైతులు ఢిల్లీలో విపరీతమైన చలిలో మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్నా ప్రధాని మోడీ మానవత్వం లేనట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కనీస మద్దతు ధర కావాలని రైతులు చేస్తున్న డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మానవీయం కోణం లేకుండా చర్చలు చేస్తోందని విమర్శించారు. ఎవరు కొనుగోలు చేసిన కనీస మద్దతు ధరలు కావాలని రైతులు అడుగుతున్నారు.. రైతుల డిమాండ్లకు మద్దతు గా ఇక్కడ దీక్ష చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన తుగ్లక్ ను మించి పోయింది, మొదట్లో రైతుల దీక్షలకు మద్దతు ఇచ్చిన కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ ధర్నాలలో కూడా పొల్గొన్నారు..  ఢిల్లీ వెళ్లి మోడీతో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా కేసీఆర్ యూ టర్న్ తీస్కున్నారని ఆరోపిపంచారు. బీజేపీ- టీఆర్ఎస్ పార్టీలు గల్లీ మే కుస్తీ.. ఢిల్లీమే దోస్తీ అన్నతీరుగా ఉందన్నారు. ఐకెపి సంఘాలు, సహకార సంఘాల ద్వారా గతంలోనే ఉన్నాయి, కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం దుర్మార్గం అని ఆరోపించారు.

పంటలు కొనుగోలు చేస్తే  7,500 కోట్లు నష్టం వచ్చిందని చెబుతున్నారు, ఇది ప్రభుత్వ చేతకాని తనానికి పరాకాష్ట అని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యం, ఇతర పంటలు కొనుగులు చేస్తుంటే  ప్రభుత్వానికి ఎలా నష్టం వస్తుందని ఆయన ప్రశ్నించారు. రైతులకు బీమా పెట్టారు, మరి పంటల బీమా ఎక్కడ ఉందని నిలదీశారు. పంటల బీమా ఇవ్వాల్సిందే, పంటలను కొనాల్సిందే.. మోడీ ప్రభుత్వం వ్యవసాయ  బిల్లులు రద్దు చేసే వరకు ఈ ఉద్యమాలు కొనసాగిస్తాంమని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా మహిళ సంఘాలు, సహకార సంఘాల ఆర్థికంగా బలపడ్డాయని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఒట్టి గాలి బుడగ లాంటిది, వరంగల్ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వచ్చే వరకు, ఖమ్మంలో  ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారంలో  ఇనుప ఫ్యాక్టరీ వచ్చే వరకు బీజేపీకి మాట్లాడే హక్కు లేదన్నారు. కేవలం మత పరంగా రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందుతోందని విమర్శించారు. రాబోయే గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికల కోసం కూడా మూడు, నాలుగు రోజులలో అభ్యర్థులను సిఫారసు చేస్తామన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్లు అమ్మినా.. కిరాయికి ఇచ్చినా పట్టా రద్దు

అది నా బెస్ట్‌.. అందుకే వీడియో మళ్లీ మళ్లీ చూస్తున్నా..

ఫ్రెండ్ షిప్ పేరుతో ట్రాప్‌‌‌‌‌‌‌‌.. గిఫ్ట్‌లు తెచ్చామంటూ మోసాలు

హోమ్‌‌ లోన్లపై ఎస్‌‌బీఐ గుడ్‌‌న్యూస్