తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 2024 జూన్ 17 వరకు వారంతపు సెలవులు ఉండడంతో శనివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కల్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. రూ.300 స్పెషల్ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది.
గురువారం నుంచి యాత్రికుల తాకిడి తగ్గలేదు, సోమవారం కూడా సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ సాగనుంది. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం పర్యవేక్షణలో సీనియర్ అధికారులు , విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, టీటీడీ భక్తులకు ఎలాంటి వారి కలగకుండా అన్నప్రసాదం, ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అటు జూన్ 14వ తేదీ శుక్రవారం రోజున స్వామి వారిని 66 వేల 782 మంది భక్తులు దర్శించుకున్నారు. 36 వేల 229 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.