
హాలియా, వెలుగు: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతను పర్యవేక్షించే సీఆర్పీఎఫ్ బెటాలియన్ (234) ను వచ్చే డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ కృష్ణా రివర్మేనేజ్ మెంట్ (కేఆర్ బీఎం) బోర్డు తాజాగాఉత్తర్వులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సాగర్ డ్యామ్ నిర్వహణపై నెలకొన్న వివాదంలో కేంద్రప్రభుత్వం ప్రాజెక్టుకు ఇరువైపులా సీఆర్పీఎఫ్ బలగాలను నియమించింది.
డ్యామ్ కు చెందిన1– 13 గేట్ల వరకు తెలంగాణ వైపు 39 బెటాలియన్, 13 –26 గేట్ల వరకు ఏపీ వైపు 234 బెటాలియన్ కు అప్పగించింది. గత ఏప్రిల్ లో తెలంగాణ వైపు బెటాలియన్ విధుల్లోంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఏపీ వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బెటాలియన్ పూర్తిస్థాయిలో విధులను నిర్వహిస్తుంది.
కేఆర్ఎంబీ మీటింగ్ లో సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించి డ్యామ్ ను తమకు స్వాధీనం చేయాలని తెలంగాణ సర్కార్ కోరగా.. అందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో వచ్చే డిసెంబర్ వరకు డ్యామ్ పై భద్రతపై సీఆర్పీఎఫ్ బలగాలను కొనగసాగించేలా కేఆర్ఎంబీ ఆదేశాలు ఇచ్చింది. కాగా డ్యామ్ పై సీఆర్పీఎఫ్ బందోబస్తు పొడిగింపుపై తమకు ఉత్తర్వులు అందాయని సాగర్ప్రాజెక్ట్ఇన్చార్జ్ఎస్ఈ మల్లికార్జున్ రావు తెలిపారు.