క్రూడాయిల్ పరుగే పరుగు!

క్రూడాయిల్ పరుగే పరుగు!

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: గ్లోబల్‌‌గా క్రూడాయిల్ ధరలు రాకెట్‌‌లా దూసుకుపోతున్నాయి.  కిందటేడాది ఏప్రిల్‌‌లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేటు 16 డాలర్లకు పడిపోయింది. అక్కడి నుంచి  నెమ్మదిగా పెరుగుతూ వస్తున్న క్రూడ్‌‌, ప్రస్తుతం ఏడేళ్ల గరిష్టమైన 82 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో లోకల్ ఎక్స్చేంజిల్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దేశ ఎంసీఎక్స్‌‌ ఎక్స్చేంజిలో బ్యారెల్ క్రూడాయిల్ (అక్టోబర్ ఫ్యూచర్స్‌‌) ధర  రూ.  5,966  వద్ద ట్రేడవుతోంది. వచ్చే ఒకటిరెండు నెలల్లో బ్యారెల్ క్రూడాయిల్‌‌ ఎంసీఎక్స్‌‌లో రూ. 6,500 క్రాస్‌‌ చేస్తుందని చాయిస్‌‌ బ్రోకింగ్‌‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌ సుమీత్‌‌ బగాడియా అంచనావేశారు. క్రూడాయిల్ చాలా బుల్లిష్‌‌గా ఉందని, రేట్లు మరింత పెరగొచ్చని చెప్పారు. కరోనా సంక్షోభం నుంచి గ్లోబల్‌‌ ఎకానమీ రికవరీ అవుతుండడంతో క్రూడాయిల్‌‌కు డిమాండ్ పెరుగుతోంది. దీనికి తోడు ఒపెక్ దేశాలు కూడా తమ ప్రొడక్షన్‌‌ను స్లోగా పెంచుతున్నాయి. డిమాండుకు తగ్గ సప్లయ్ లేక క్రూడాయిల్ ధరలు చుక్కలనంటుతున్నాయి. సాధారణంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే ఇన్‌‌ఫ్లేషన్‌‌ పెరుగుతుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోతుంది. ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం పడుతుంది. బాండ్ ఈల్డ్‌‌లు పెరుగుతాయి. బాండ్ ఈల్డ్‌‌లు పెరిగితే ఇండియా లాంటి దేశాల నుంచి తమ ఇన్వెస్ట్‌‌మెంట్లను తీసుకెళ్లి ఇన్వెస్టర్లు యూఎస్‌‌, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పెడతారు.

మరిన్ని వార్తల కోసం..

పండుగ బాదుడు.. చార్జీలు పెంచేసిన రైల్వే, ఆర్టీసీ, ట్రావెల్స్

చెన్నై వర్సెస్ ఢిల్లీ: ఫైనల్‌కు చేరేదెవరు?

కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్టు

టార్గెట్ చేసి టెర్రర్ అటాక్స్: మళ్లీ క్యాంపుల్లోకే కాశ్మీరీ పండిట్లు!